టీటీడీ: టీటీడీ శిల్పకళా అకాడమీలో ఉచిత కోర్సులు – దరఖాస్తులు ఆహ్వానం

టీటీడీ ఉచిత శిల్పకళ శిక్షణ కోర్సులు – 2025–26

శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్పకళ శిక్షణ సంస్థ (SVTSS), తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో, ప్రాచీన ఆలయ శిల్పకళ పరిరక్షణ కోసం ఉచిత శిక్షణను అందిస్తోంది.

ప్రత్యేకతలు:

  • సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో శిక్షణ

  • పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన యువతకు అవకాశం

  • పూర్తిగా ఉచితంగా శిక్షణ, వసతి, భోజన సదుపాయాలు

  • కోర్సు పూర్తయ్యాక విద్యార్థి పేరిట రూ.1 లక్ష ఆర్థిక ప్రోత్సాహం

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక

  • దరఖాస్తులకు చివరి తేది: జూన్ 20, 2025

అందుబాటులో ఉన్న కోర్సులు:

1. డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ (4 సంవత్సరాలు)

AICTE & రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు
6 విభాగాలు:

  • ఆలయ నిర్మాణం

  • శిలా శిల్పం

  • సుధా (గచ్చు) శిల్పం

  • లోహ శిల్పం

  • కొయ్య శిల్పం

సంప్రదాయ వర్ణచిత్రలేఖనం

  • ప్రతి విభాగానికి 10 మంది విద్యార్థులకు ప్రవేశం (మొత్తం 60 మంది)

2. కలంకారి సర్టిఫికెట్ కోర్సు (2 సంవత్సరాలు)

  • వస్త్రాలపై సంప్రదాయ చిత్రలేఖనం
  • ప్రతి సంవత్సరం 10 మంది విద్యార్థులకు ప్రవేశం

శిక్షణలో ప్రత్యేకతలు:

  • విద్యార్థులందరికీ ఉచిత వసతి మరియు భోజనం

  • డిప్లొమా చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారత ప్రఖ్యాత ఆలయాలకు విజ్ఞాన యాత్ర

  • కోర్సు పూర్తయినవారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు

  • కలంకారి కళకు దేశవిదేశాల్లో ప్రాచుర్యం

  • డిప్లొమా పూర్తయిన విద్యార్థి పేరిట జాతీయ బ్యాంకులో ₹1 లక్ష డిపాజిట్, కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా ఇవ్వబడుతుంది

ఉపాధి అవకాశాలు:

  • టీటీడీ సంస్థలో బోధన ఉద్యోగాలు

  • టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు

  • దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు

  • జాతీయ స్థాయి అవార్డులు పొందిన విద్యార్థులు

  • సంస్థ అనుబంధంగా ఉన్న విభాగంలో దేవతామూర్తుల తయారీకి కాంట్రాక్టు అవకాశాలు

దరఖాస్తు వివరాలు:

  • దరఖాస్తు ప్రారంభం: మే 5, 2025

  • చివరి తేదీ: జూన్ 20, 2025

  • ప్రవేశ పరీక్ష: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం

మరిన్ని వివరాలకు సంప్రదించండి:

శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానములు,
అలిపిరి రోడ్, తిరుపతి – 517507,
తిరుపతి జిల్లా.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens