కలియుగ వైకుంఠం తిరుమలలో జులై నెల శ్రీవారి విశేష ఉత్సవాల జాబితా విడుదల
కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెలా విశేషమైన పూజలు, సేవలు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా జులై నెలలో అనేక విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా జూలై మాసానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా జులై 5వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు జరగబోయే తొమ్మిది ముఖ్యమైన విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారికంగా విడుదల చేసింది. భక్తులు ఈ తేది వారిగా జరిగే ఉత్సవాలను గమనించి తమ దర్శనాలను ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు.
జూలై 2025లో జరుగనున్న శ్రీవారి విశేష ఉత్సవాల జాబితా:
-
జూలై 5: పెరియాళ్వార్ శాత్తుమొర
-
జూలై 6: శయన ఏకాదశి, చాతుర్మాస వ్రతారంభం
-
జూలై 7: శ్రీనాథ మునుల వర్ష తిరునక్షత్రం
-
జూలై 10: గురుపౌర్ణమి గరుడసేవ
-
జూలై 16: ఆణివారి ఆస్థానం
-
జూలై 25: చక్రతాళ్వార్ వర్ష తిరునక్షత్రం
-
జూలై 28: పురిశైవారి తోటకు శ్రీవారి ఉత్సవ విగ్రహం వేంచేపు
-
జూలై 29: గరుడ పంచమి – శ్రీవారి గరుడ సేవ
-
జూలై 30: కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహం పొందాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.