తిరుమలలో భారీ భక్తుల రద్దీ – సర్వదర్శనానికి 12 గంటల వేచి

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం లభించేందుకు దాదాపు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.

నిన్న ఒక్కరోజే 71,208 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 23,135 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు గా నమోదైందని టిటిడి వివరించింది.

భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, దర్శనం నిర్వాహణకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తూ అన్ని విభాగాలతో సమన్వయం కొనసాగిస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book