National

భారత్ బంద్ నేడు: బ్యాంకింగ్, రవాణా సేవలకు అంతరాయం

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదికి పైగా కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) గురువారం (ఫిబ్రవరి 12) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక మరియు కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

సంయుక్త కిసాన్ మోర్చా మద్దతుతో ఈ బంద్ ప్రభావం దేశవ్యాప్తంగా పలు రంగాలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, బీమా, రవాణా, విద్యుత్, బొగ్గు, గ్యాస్ రంగాల్లో సేవలకు అంతరాయం కలగవచ్చు. ఏఐబీఈఏ, ఏఐబీవోఏ వంటి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్ సేవలు కొంతమేర ప్రభావితమయ్యే అవకాశముంది.

కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసేందుకే ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్సులు, ఫార్మసీలు, పాలు వంటి అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, పాఠశాలలు, కళాశాలలు సాధారణంగా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ, స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు ఉండవచ్చు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book