తిరుమలలో మలయప్ప స్వామి పల్లవోత్సవం నిన్న ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ ప్రతియేటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. అక్కడ మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామివారికి ఘన స్వాగతం పలికారు. వారు ప్రత్యేక హారతులు సమర్పించి, సంప్రదాయ ఆతిథ్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా మైసూరు మహారాణి ప్రమోదాదేవి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్, టీటీడీ బోర్డు సభ్యులు నరేశ్, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.