టీజీ ఈఏపీసెట్ మే 4 నుంచి 11 వరకు – ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) పరీక్షలను మే 4 నుంచి మే 11 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
టీజీ ఈఏపీసెట్ పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది:
-
మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు
-
మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు
ఇతర ప్రవేశ పరీక్షల తేదీలు:
-
మే 12న టీజీ ఎడ్‌సెట్
-
మే 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్
-
మే 15న టీజీ ఈసెట్
-
మే 18న టీజీ లాసెట్ మరియు పీజీ లాసెట్
-
మే 28 నుంచి 31 వరకు టీజీ పీజీ ఈసెట్
-
మే 31 నుంచి జూన్ 3 వరకు టీజీ పీఈసెట్
విద్యార్థులు తమ పరీక్ష తేదీలను గమనించి, ముందుగానే సన్నాహాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.