Latest Updates

ప్రభాస్ విడుదల చేయనున్న ‘కాంత’ మూవీ ట్రైలర్

ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 1960ల నాటి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. ఆ కాలానికి తగ్గట్టుగా సెట్ డిజైన్, కాస్ట్యూమ్స్, విజువల్స్‌తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

ఇకపోతే, దుల్కర్ సల్మాన్ ఇటీవలి కాలంలో కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అందువల్ల కాంత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

ఇదిలా ఉండగా, ప్రభాస్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావడం వెనుక ఓ ప్రత్యేక సెంటిమెంట్ ఉందనే టాక్ పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ మద్దతు ఇచ్చిన కాంతార, మిరాయ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. అందువల్ల ప్రభాస్ సపోర్ట్ సక్సెస్ సెంటిమెంట్‌గా మారింది.

మొత్తానికి, ప్రభాస్ సపోర్ట్‌తో కాంత సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book