రాత్రి వేళల్లో హైదరాబాద్ మెట్రోలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇథేమ్స్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన అధ్యయనంలో సిబ్బంది కొరత, సరైన లైటింగ్ లేకపోవడం ప్రధాన సమస్యలుగా గుర్తించబడింది. సర్వేలో పాల్గొన్న 410 మంది మహిళలలో 11 శాతం మంది మైకీ విధమైన వేధింపులు ఎదుర్కొన్నట్టు వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో పురుషులు మహిళల కోచ్‌లలోకి ప్రవేశిస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాదిలో మెట్రో రైలు రాత్రి సమయాల్లో సురక్షితంగా లేకపోవడం ప్రధాన ఆందోళన. అధ్యయనం ప్రకారం, సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది మహిళలు పగటిపూట సురక్షితంగా భావించినా, రాత్రి సమయంలో భద్రత తగినంతగా లేదని తేలింది. నివేదికలో మెట్రో స్టేషన్లలో మహిళా సిబ్బంది పెంచడం, లైటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరచడం, సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచడం వంటి సూచనలు ఉన్నాయి. ఈ అధ్యయనం డాక్టర్ సహేరా ఫాతిమా నేతృత్వంలో విద్యార్థి బృందం నిర్వహించింది.