పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో జూలై 13 నుంచి 16 వరకు తెలంగాణలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
అలాగే, నేడు మరియు రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
నిన్న నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో అత్యధికంగా 11.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలు వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.