రేవంత్ రెడ్డి: హైదరాబాద్‌కు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ – బెంగళూరు, చెన్నై, అమరావతికి హైస్పీడ్ రైళ్లు!

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే మూడు కొత్త హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలకు ఈ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ల పురోగతిని పరిశీలించడానికి ముఖమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి రైల్వే ముఖ్య ఇంజనీర్లు కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

రెండు మార్గాలకు ఇప్పటికే అలైన్‌మెంట్ ఖరారు చేయబడింది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు మార్గం కాజీపేట్ మీదుగా కాకుండా నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ మార్గాల ద్వారా వెళ్తుంది. ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 6–7 స్టేషన్లు ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గం ప్రతిపాదిత నాగ్‌పూర్-హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే సమాంతరంగా నిర్మించబడుతుంది. రాష్ట్రంలో 4–5 స్టేషన్లు ఏర్పాటు కావొచ్చని అంచనా.

మరోవైపు, హైదరాబాద్-అమరావతి మార్గంపై కూడా కసరత్తులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే సమాంతరంగా హైస్పీడ్ రైలు మార్గం నిర్మించాలనే కోరిక కేంద్రం సమీక్షలో చర్చ జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ (RRR) పక్కన రీజనల్ రింగ్ రైలు మార్గం నిర్మించడానికి 45 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమని ప్రతిపాదన జరిగింది. అలాగే వికారాబాద్-కృష్ణా, డోర్నకల్-గద్వాల, కల్వకుర్తి-మాచర్ల వంటి కొత్త రైల్వే లైన్లపై కూడా చర్చ జరిగింది.

ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా తెలంగాణలో ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందని, రైల్వే నెట్‌వర్క్ బలోపేతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book