తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసి అత్యంత భారీ వర్షాల సూచన ఇచ్చింది.
ములుగు, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.
ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వాతావరణ సమాచారం కోసం నిరంతరం అప్డేట్స్ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.