దక్షిణ మధ్య రైల్వేలో రికార్డు స్థాయిలో టికెట్ లేని ప్రయాణికులపై జరిమానాలు వసూలు చేశారు. మంగళవారం జోన్ వ్యాప్తంగా నిర్వహించిన మెగా టికెట్ తనిఖీ డ్రైవ్‌లో ఒక్కరోజే 16,105 కేసులు నమోదు చేసి రూ.1.08 కోట్లకు పైగా ఫైన్ వసూలు అయ్యింది. ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒక రోజులోనే అత్యధికంగా జరిమానాలు వసూలు చేయబడిన రికార్డు.
డివిజన్ల వారీగా చూస్తే, విజయవాడ డివిజన్‌లో అత్యధికంగా రూ.36.91 లక్షల ఫైన్ వసూలు కాగా, గుంతకల్లు రూ.28 లక్షలు, సికింద్రాబాద్ రూ.27.9 లక్షలు, గుంటూరు రూ.6.46 లక్షలు, హైదరాబాద్ రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్‌లో రూ.4.08 లక్షలు జరిమానాలు విధించారు. ఈ తనిఖీలను డివిజన్లలోని సిబ్బంది గట్టి పద్ధతిలో నిర్వహించి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపట్టారు.
రైల్వే అధికారులు ఈ మెగా తనిఖీలతో ప్రజలలో సరైన ప్రయాణ ఆచరణపై అవగాహన పెంచాలని, టికెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని హెచ్చరించారు.