శబరి ఎక్స్‌ప్రెస్ ఇక సూపర్‌ఫాస్ట్.. ప్రయాణికులకు రెండు గంటల ఆదా!

సికింద్రాబాద్ – తిరువనంతపురం (త్రివేండ్రం) మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఎంతో కీలకమైన శబరి ఎక్స్‌ప్రెస్ను ఇకపై సూపర్‌ఫాస్ట్ రైలుగా నడపనుంది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా చేసుకోవచ్చు.

ఇకపై ఈ రైలు నంబర్ 17229/30 నుంచి 20629/30గా మారింది. అలాగే రెండు వైపులా ప్రయాణ వేళల్లో కూడా మార్పులు జరిగాయి.

సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం:

  • కొత్త టైమింగ్ – ప్రతిరోజూ మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6:25 గంటలకు చేరుకుంటుంది.
  • పాత టైమింగ్ – మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు చేరేది.

తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్:

  • బయలుదేరే సమయం యథాతథంగా ఉదయం 6:45 గంటలకే ఉంటుంది.
  • కొత్త చేరిక – ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
  • పాత చేరిక – మధ్యాహ్నం 12:45 గంటలకు చేరేది.

ఈ మార్పుల వల్ల ప్రయాణికులు త్వరగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book