దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు స్వస్థలాలకు వెళ్లే వారి సౌకర్యార్థం గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
తిరుపతి - సికింద్రాబాద్ స్పెషల్ (07497):
ఈ రైలు నేటి రాత్రి 7:40 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. అర్ధరాత్రి 1:30 గంటలకు తెనాలి, 2:20 గంటలకు గుంటూరు, 3:00 గంటలకు సత్తెనపల్లి, తెల్లవారుజామున 4:00 గంటలకు నడికుడికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని అధికారులు తెలిపారు.
విజయవాడ - సికింద్రాబాద్ స్పెషల్ (07213):
ఈ రైలు నేడు, రేపు ఉదయం 6:25 గంటలకు విజయవాడలో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇది ఉదయం 7:03 గంటలకు మంగళగిరి, 7:30 గంటలకు గుంటూరు, 8:18 గంటలకు సత్తెనపల్లి, 8:48 గంటలకు పిడుగురాళ్ల, 9:18 గంటలకు నడికుడి మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 1:00 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం – సికింద్రాబాద్ - విజయవాడ స్పెషల్ (07214):
ఈ రైలు అక్టోబర్ 17, 18 తేదీల్లో సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. రాత్రి 7:28 గంటలకు సత్తెనపల్లి, 8:25 గంటలకు గుంటూరు, 8:58 గంటలకు తెనాలికి చేరుకుని, రాత్రి 9:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.