తెలంగాణలో వన మహోత్సవం ప్రారంభం – 18.03 కోట్ల మొక్కల నాటే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ స్వయంగా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తర్వాత సీఎం రేవంత్ బొటానికల్ గార్డెన్స్ సందర్శించి, అక్కడ ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. అలాగే, కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆసక్తిగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం విజయవంతం చేయాలని ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.