Jubilee Hills By-Election: నిరుద్యోగుల వ్యూహం – కాంగ్రెస్ ఓటమే లక్ష్యం!

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల ఆగ్రహం చెలరేగింది. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం విఫలమైందంటూ నిరుద్యోగ యువత భారీ స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతోంది. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా నిరుద్యోగ జేఏసీ వినూత్న వ్యూహాన్ని రూపొందించింది. ఈ ఎన్నికలో 1000 మంది నిరుద్యోగులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది.

సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. జేఏసీ చైర్మన్ కందరపల్లి కాశీనాథ్ మాట్లాడుతూ, "రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే" అని విమర్శించారు. జేఏసీ వైస్ చైర్మన్ భూక్యా కుమార్, జనరల్ సెక్రటరీ ఆర్‌.కె‌. వన్నార్ చోళ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రూప్-1 ప్రక్రియను సంక్లిష్టం చేస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ, "నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఉప ఎన్నికలో ప్రజలు చిత్తుగా ఓడించాలి" అని పిలుపునిచ్చారు. ఇతర నేతలు మాట్లాడుతూ, "దేశంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే, తెలంగాణలో ఉద్యోగాల చోరీ జరుగుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book