భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్లలో కీలకమైన మార్పులు వచ్చాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన కొత్త విధానం ప్రకారం, జనవరి నుండి ప్రయాణికులు బుక్ చేసిన టికెట్‌పై రద్దు లేకుండా ఆన్‌లైన్‌లోనే ‘ప్రయాణ తేదీ’ని మార్చుకునే అవకాశం పొందబోతున్నారు. ఇప్పటివరకు టికెట్‌ను రద్దు చేసి కొత్తగా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
కొత్త విధానంలో:
- ఎలాంటి రద్దు లేకుండా టికెట్‌పై తేదీ మార్చుకోవచ్చు
- అదనపు రుసుము లేదు
- ఆన్‌లైన్‌లో సులభంగా మార్పు
- కొత్త తేదీలో సీట్లు ఖాళీగా ఉండాలి
- కొత్త టికెట్ ధర ఎక్కువ అయితే వ్యత్యాసాన్ని ప్రయాణికుడు భరించాలి
ప్రస్తుత విధానం:
- కన్ఫర్మ్ టికెట్‌పై తేదీ మార్చడం సాధ్యం కాదు
- టికెట్ రద్దు చేసి కొత్త టికెట్ బుక్ చేయాలి
- రీఫండ్‌లో తగ్గింపు ఉంటుంది, రిజర్వేషన్ చార్ట్ విడుదల అయిన తర్వాత రీఫండ్ ఉండదు
ఈ కొత్త సదుపాయం రైల్వే ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, వినియోగదారులకు తక్షణ సౌకర్యం అందించేలా రూపొందించబడింది.