బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఈ పరిస్థితుల్లో, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లా కలెక్టర్లు గురువారం రోజున ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తూ, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.