వెలగపూడి సచివాలయంలో నేడు ఏపీ కేబినెట్ సమావేశం – రాజధాని అభివృద్ధి, మహిళల సంక్షేమంపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ముఖ్యంగా చర్చకు రానున్న అంశాలు:
-
రాజధాని ప్రాంతంలో 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రివర్గ ఆమోదం
-
నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ నిర్మాణానికి అనుమతులు
-
పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్
-
అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల నిర్మాణంపై చర్చ
-
బనకచర్ల ప్రాజెక్టు, సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమాలపై సమీక్ష
-
తల్లికి వందనం అమలుపై సమీక్ష,
-
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం పై చర్చ
సమావేశం అనంతరం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు.