తెలంగాణలో వాతావరణం అసాధారణం: రుతుపవనలకు విరామం, మళ్లీ ఎండలు పెరుగుతున్నాయి!

రాష్ట్రంలో రుతుపవనలకు అకస్మాత్ విరామం
కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరాయి.mజూన్ 10 తర్వాతే రుతుపవనల్లో మళ్లీ చురుగ్గా కదలిక ఉంటుందనే అంచనా. రాబోయే 2-3 రోజులు ఎక్కువగా వేడి వాతావరణం ఉంటుందని సూచన. సాయంత్రం వేళ కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురవచ్చు.
తెలంగాణలో వాతావరణం ప్రస్తుతం విచిత్రంగా మారింది. ముందుగానే ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా నెమ్మదిపోవడంతో వర్షాలు ఆగిపోయాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వేసవి ఎండలు మళ్లీ పడి ఉన్నాయి. పగటిపూట ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రం కొన్ని చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడుతూ వాతావరణం అస్థిరంగా ఉంది.

వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణానికి పోల్చితే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 38 నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ నెల 10 తర్వాత మళ్లీ రుతుపవన కదలిక చురుగ్గా కొనసాగుతుందని తెలుస్తోంది.

రాబోయే రెండు మూడు రోజుల్లో ఎక్కువ భాగంలో వేడి వాతావరణం కొనసాగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉండవచ్చు. రుతుపవన విరామం సాధారణ విషయం కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పగటి వేళల్లో ఎక్కువ ఉక్కపోత ఉండగా, రాత్రి కొంత చల్లదనం ఉంటుంది. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ రెండో వారం నుంచి వర్షాలు బలపడే అవకాశంతో, రైతులు మంచి పంట కోసం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book