ఈరోజు, రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన

ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన, నేడు మరియు రేపు పలు ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఈ రోజు ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఉదయం 10.30 గంటలకు కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, 4.30 గంటలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 5.30 గంటలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌లతో వరుసగా భేటీలు జరగనున్నాయి.

రేపు ఉదయం కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాను, అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను కూడా మంత్రి లోకేశ్ కలవనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగం, పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలపై చర్చలు జరగనున్నాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book