కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి అనుమతులు ఉన్నాయా? – తెలంగాణను ప్రశ్నించిన లోకేష్

అమరావతి, జూలై 31: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించారు. అంతేకాక తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులున్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డుకాలేదని, మరి తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెబుతుందో అడిగారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్, బనకచెర్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో నుంచి వచ్చిన నీటిని ఎలాంటి అన్యాయంగా తీసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ నేలలో వదిలి పోతున్న నీటిని మాత్రమే మళ్లిస్తున్నామని అన్నారు.

లోకేష్ తదుపరి లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతూ, జాగన్ పై ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయల నగదు, చెక్కుల రూపంలో లావాదేవీలు జరిగాయని చెప్పారు. రాజకీయాలను క్రిమినలైజ్ చేసే వ్యవస్థను తిప్పికొట్టాలని అన్నారు. టీడీపీ ఎప్పుడూ తెలుగు ప్రజల ఐక్యత కోసం పనిచేస్తుందని, తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదని స్పష్టం చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book