గిరిజన గురుకులాల్లో బోధనా సిబ్బందికి వేతనాల పెంపు – అధికారిక ఉత్తర్వులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ ఆధారంగా పనిచేస్తున్న బోధనా సిబ్బందికి శుభవార్త చెప్పింది. వారి వేతనాలను పెంచుతూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయం ద్వారా మొత్తం 1659 మంది బోధనా సిబ్బందికి లాభం చేకూరనుంది. కేటగిరీ ‘ఏ’ కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు మరియు కళాశాలల్లో ఉన్న సిబ్బందికి ఇది వర్తిస్తుంది. ఇందులో జూనియర్ లెక్చరర్లు, పీడీ (సీ), లైబ్రేరియన్లకు ₹24,150, టీజీటీలు మరియు పీడీ (ఎస్)లకు ₹19,350, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు ₹16,300గా వేతనాలను పెంచారు.
దీంతో, ఎంతోకాలంగా వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న బోధనా సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. వారు ప్రభుత్వానికి, శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.