టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖ
నేటి నుంచి టెండర్లు దాఖలు
బిడ్ దాఖలు చివరి తేదీ అక్టోబర్ 22
కన్సల్టెన్సీకే అనుమతుల స్వీకరణ బాధ్యతలు
పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.9.20 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ ప్రకటనను విడుదల చేసింది.
కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి స్థాయి డీపీఆర్ రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందడం, సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయడం వంటి బాధ్యతలు ఎంపికైన కన్సల్టెన్సీకి అప్పగించబడతాయని అధికారులు తెలిపారు.
బిడ్‌ల సమర్పణ తేదీలు:
- టెండర్ దాఖలుకు ప్రారంభ తేదీ – అక్టోబర్ 8
- చివరి తేదీ – అక్టోబర్ 22
అర్హత కలిగిన కన్సల్టెన్సీలు నిర్ణీత గడువులో బిడ్‌లలో పాల్గొనాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా సాంకేతిక నైపుణ్యం కలిగిన సంస్థలు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.