UPIలో కొత్త శకం – ఇక పిన్ అవసరం లేదు, ముఖమే పాస్‌వర్డ్!

దేశంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపుల్లో సరికొత్త విధానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4 లేదా 6 అంకెల పిన్ ద్వారా జరిగే లావాదేవీలను ఫేస్ రికగ్నిషన్ లేదా ఫింగర్‌ప్రింట్ ద్వారా సులభంగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసి, ముంబైలో అధికారికంగా ప్రారంభించింది. పిన్‌కు ప్రత్యామ్నాయం మాత్రమే అయిన ఈ సౌకర్యం చెల్లింపుల ప్రక్రియను వేగవంతంగా, సురక్షితంగా మారుస్తుందని NPCI తెలిపారు.

PIN ఆధారిత మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల మేరకు UPIలో బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కొత్త యూజర్లు మరియు వృద్ధులు ఈ విధానంలో చాలా సౌకర్యాన్ని పొందగలరు. ఇప్పుడు వినియోగదారులు తమ ముఖం లేదా వేలిముద్ర ద్వారా క్షణాల్లో లావాదేవీలు పూర్తిచేయగలరు, దీని ద్వారా డిజిటల్ చెల్లింపులు మరింత మందికి చేరతాయని NPCI ఆశాభావం వ్యక్తం చేసింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book