తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. నేడు, రేపు రెండు రోజుల పాటు తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తాజా బులెటిన్ ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.