శ్రీశైలం జలాశయం: లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం – విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

కృష్ణా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు – శ్రీశైలం జలాశయానికి భారీ వరద

కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం గంటగంటకూ పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,00,085 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది.

ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు, అయితే నేటి ఉదయానికి అది 874.30 అడుగులకు చేరింది. ఇంకా 12 అడుగుల నీరు చేరితే జలాశయం నిండుతుంది. మొత్తం 215 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో, ఇప్పటికి 160.52 టీఎంసీల వరకు నీరు చేరింది.

ఈ వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని, కుడి మరియు ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book