Srisailam Reservoir Flood Update: Heavy Inflow Continues – Current Situation at the Project

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 1,27,392 క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుతోంది. అదే సమయంలో శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులు గా ఉంది.

నాగార్జునసాగర్‌కు రెండు స్పిల్ వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.40 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book