తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ ‘వార్-2’, ‘కూలీ’ టికెట్ ధరలు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ నటించిన వార్ 2 భారీ బడ్జెట్ సినిమాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ మొదలై హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిన్న సాయంత్రం నుంచి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో టికెట్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు. సింగిల్ స్క్రీన్‌లలో రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295గా టికెట్లు లభిస్తున్నాయి. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మాత్రమే ఒక స్పెషల్ షో అనుమతించారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అనేక థియేటర్లలో స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో, కూలీ మూవీ రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు అదనపు షోకి అనుమతి ఇచ్చారు. ఆగస్టు 14 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు రూ.75, మల్టీప్లెక్స్ టికెట్ ధరలు రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి అనుమతించారు. వార్ 2 స్పెషల్ షో టికెట్ ధర రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. ఇదే తేదీల్లో రెగ్యులర్ షోలకు కూడా ధరల పెంపు అమల్లో ఉంటుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book