రజనీకాంత్: నాగార్జున నా సినిమాలో విలన్‌గా ఎందుకు ఒప్పుకున్నారు

రజనీకాంత్: ఎప్పుడూ మంచివాడిగానే నటించాలా అనే ఆలోచనతో నాగార్జున విలన్ పాత్రకు ఒప్పుకున్నారు

రజనీకాంత్ కథానాయకుడిగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ చిత్రం ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రజనీకాంత్ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో నాగార్జున విలన్ పాత్రకు డబ్బు కోసమేమీ కాదు, "ఎప్పుడూ మంచివాడిగానే నటించాలా?" అనే ఆలోచనతో పాత్రకు ఒప్పుకున్నారని చెప్పారు.

నాగార్జున డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదని, ఆయనకు ఆ అవసరం కూడా లేదని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. సైమన్ పాత్రకు సరిపోయే నటుడిని ఎన్నుకోవడానికి లోకేశ్ కనగరాజ్ చాలా మంది నటులతో మాట్లాడారట. చివరకు ఆ నటుడు నాగార్జుననే అని తెలిసి తాను ఆశ్చర్యపోయానని, అతను ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

మరియు, “మేమిద్దరం చివరిసారిగా 33 సంవత్సరాల క్రితం కలిసి నటించాం. నాగార్జున అప్పుడు ఎలా ఉంటే ఇప్పటికీ అలాగే ఉన్నారు. కానీ నా జుట్టు ఊడిపోయింది,” అంటూ నవ్వుతూ గుర్తుచేశారు. నాగార్జున ఆరోగ్య రహస్యాలా? వ్యాయామం, ఈత, కొద్దిగా డైట్, తండ్రి నుంచి వచ్చిన మంచి జీన్స్ అని చెప్పారు అని తెలిపారు. ఈ సినిమాలో సత్యరాజ్, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ వంటి ప్రముఖులు నటించగా, ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. లోకేశ్ చేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయని, తెలుగు ప్రేక్షకుల్లో రాజమౌళికి ఉన్న స్థానం తమిళంలో లోకేశ్‌దే అని అభిప్రాయపడ్డారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book