ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం – అప్రమత్తం చేసిన అధికారులు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఇన్‌ఫ్లో వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 3.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, అదే మొత్తంలో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
అధికారుల అంచనాల ప్రకారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీనితో నదీ తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు.
లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు–కాలువలు దాటరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభావిత జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశించారు.