పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన హరీశ్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇందులో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ, సెట్స్ నుంచి తీసిన ఫోటోను షేర్ చేశారు. పవన్‌ సపోర్ట్ వల్లే షూటింగ్ త్వరగా పూర్తయిందని హరీశ్ పేర్కొన్నారు.

పవన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ – "మాటిస్తే నిలబడటం, మాట మీదే నిలవడం... మీరు పక్కన ఉంటే కరెంట్ పాకినట్లే ఉంది. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవలే పవన్ ‘హరిహర వీరమల్లు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన OG మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇలా ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో అభిమానులను పవర్ స్టార్ పండుగలో ముంచెత్తుతున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book