పవన్ కళ్యాణ్ ఓజీ 11 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 25, 2025న విడుదలైన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, 2025లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ‘ఎక్స్’ ద్వారా “రూల్స్ లేవు, చట్టాలు లేవు... గంభీర ‘లా’ మాత్రమే ఉంది! ఇతడే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్” అంటూ సినిమా వసూళ్ల వివరాలు వెల్లడించింది.

విడుదలైన మొదటి రోజే రూ.154 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఓజీ, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” రూ.300 కోట్ల మార్క్ దాటినా, ఓజీ ఆ రికార్డును కేవలం 11 రోజుల్లోనే అధిగమించింది.

దర్శకుడు సుజీత్, పవన్ అభిమానిగా తన హీరోను స్టైలిష్‌గా, గంభీరంగా తెరపై చూపించారు. ఆయన తెలిపినట్లుగా, ‘ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పవన్ కుమారుడు అకీరా నందన్ ఇందులో నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన, “ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదు” అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book