పవన్ కల్యాణ్: పవన్ పై తమిళనాడు మంత్రి ఆగ్రహం వ్యక్తం

తమిళనాడులో పవన్ వ్యాఖ్యలు – మంత్రి శేఖర్ బాబు ఘాటుగా స్పందన

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు" అని చెప్పారు. ప్రజలు ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇతర మతాలను గౌరవించడం ఎలా సమానంగా ఉంటుందో, హిందువులు కూడా తమ మతాన్ని గౌరవించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఈ వ్యాఖ్యలు డీఎంకే నేతలపై పరోక్షంగా చేసిన విమర్శలుగా చెబుతున్నారు, ముఖ్యంగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే. దీనిపై తమిళనాడు దేవాదాయశాఖ మంత్రి శేఖర్ బాబు తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు తమిళనాడుతో ఏమిటీ సంబంధం? మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరంటూ మండిపడ్డారు.

అలాగే, పవన్ బీజేపీ మాయలో పడొద్దని హెచ్చరించారు. ఆయనను 2026 ఎన్నికల్లో చెన్నైలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తమిళ ప్రజలు పవన్ వ్యాఖ్యలను నమ్మరని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం దేవాదాయశాఖ అభివృద్ధిపై పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book