హరిహర వీరమల్లు పార్ట్-2పై పవన్ కల్యాణ్ స్పందించారు

హరి హర వీరమల్లు పార్ట్-2పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, హరి హర వీరమల్లు పార్ట్-2 గురించి మంగళగిరిలో విలేఖరులతో నిన్న జరిగిన సమావేశంలో కీలక సమాచారం పంచుకున్నారు. ఈ నెల 24న 'హరి హర వీరమల్లు పార్ట్-1 – స్వోర్డ్ vs స్పిరిట్' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్ట్-2 షూటింగ్ ఇప్పటికే 20 – 30 శాతం పూర్తైందని పవన్ తెలిపారు. ఈ సినిమా రెండవ భాగాన్ని తనకు అందుబాటులో ఉండే బడ్జెట్, సమయం ఆధారంగా పూర్తిచేస్తానన్నారు. దీనికోసం భగవంతుని ఆశీస్సులు కావాలన్నారు.

కథ విషయానికొస్తే, ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని, సర్వాయి పాపన్న కథతో ఎలాంటి సంబంధం లేదని పవన్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ఒక వీరుడు విదేశాలకు తరలించిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి చేసే యత్నం కథగా ఉంటుందని వివరించారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book