ప‌వ‌న్ కళ్యాణ్ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఎప్పుడు? ఎక్కడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ దగ్గరపడుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర బృందం వేగం పెంచింది. ఈ నెల 8న తిరుపతిలోని ఎస్‌వీయూ తారకరామ క్రీడా మైదానంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవన్ కల్యాణ్ ఈ వేడుకకు హాజరయ్యేందుకు జూన్ 7న తిరుపతి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించే అవకాశమున్నట్టు సమాచారం.

ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మరియు ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక వీరుడు మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సాహసోపేతమైన ప్రయాణం ఎలాగా సాగిందనే విషయాన్ని చూపించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ భారీ తారాగణం, చారిత్రక కథాంశం మరియు అట్టహాసంగా ప్లాన్ చేస్తున్న ప్రీ రిలీజ్ వేడుకతో ‘హరిహర వీరమల్లు’ 2025లో తెలుగు సినీప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book