భారతీయ యూజర్లకు ఓపెన్ఏఐ బంపరాఫర్ – ఏడాది పాటు చాట్‌జీపీటీ గో ఉచితం

భారతీయ యూజర్లకు ఓపెన్ఏఐ బంపరాఫర్ – ఏడాది పాటు చాట్‌జీపీటీ గో ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ఏఐ, భారతీయ యూజర్లకు శుభవార్త ప్రకటించింది. తన అడ్వాన్స్‌డ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అయిన “చాట్‌జీపీటీ గో”ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక ప్రమోషనల్ పీరియడ్‌లో సైన్ అప్ చేసే యూజర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. పాత సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

ఈ నిర్ణయాన్ని ఓపెన్ఏఐ తన మొదటి “డెవ్‌డే ఎక్స్ఛేంజ్” ఈవెంట్‌ను బెంగళూరులో నవంబర్ 4న నిర్వహించే సందర్భంలో ప్రకటించింది. భారత్‌ తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని పేర్కొంటూ, ఏఐ టూల్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ “ఇండియాఏఐ మిషన్” కు మద్దతుగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

ఏమిటీ చాట్‌జీపీటీ గో?

చాట్‌జీపీటీ గో అనేది ఓపెన్ఏఐ ఇటీవల ప్రారంభించిన ఒక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా యూజర్లు జీపీటీ-5 ఆధారిత అధునాతన ఫీచర్లను ఉపయోగించవచ్చు. ఇందులో ఎక్కువ మెసేజ్‌లు పంపే అవకాశం, మెరుగైన ఇమేజ్ జనరేషన్, ఫైల్స్ & ఇమేజ్‌లను అప్‌లోడ్ చేసే సౌకర్యం, ఎక్కువ కాలం సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు కావాలని భారతీయ యూజర్ల అభ్యర్థనల మేరకు ఈ ప్లాన్‌ను మొదటగా భారత్‌లో ఆగస్టులో ప్రారంభించారు.

భారత్‌లో అద్భుత స్పందన

భారత్‌లో చాట్‌జీపీటీ గోకు అద్భుత స్పందన లభించింది. ప్రారంభించిన నెలలోనే పెయిడ్ యూజర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈ విజయంతో ప్రేరణ పొందిన ఓపెన్ఏఐ, ఈ ప్లాన్‌ను ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం అమెరికా తర్వాత భారత్ ఓపెన్ఏఐకు రెండో అతిపెద్ద మార్కెట్. విద్యార్థులు, నిపుణులు, డెవలపర్లు లక్షలాదిమంది ప్రతిరోజూ చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఓపెన్ఏఐ వైస్ ప్రెసిడెంట్ నిక్ టర్లీ మాట్లాడుతూ — “భారతీయ యూజర్లు చాట్‌జీపీటీ గోను వినియోగిస్తున్న తీరు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. తొలి డెవ్‌డే ఎక్స్ఛేంజ్ ఈవెంట్ సందర్భంగా మరింత మందికి అడ్వాన్స్‌డ్ ఏఐ ప్రయోజనాలు అందించేందుకు దీన్ని ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నాం” అన్నారు.

ప్రస్తుతం చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి కూడా ఈ 12 నెలల ఉచిత ఆఫర్ వర్తిస్తుందని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఓపెన్ఏఐ తెలిపింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book