జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై చివరికి స్పష్టత వచ్చింది. మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించిన ప్రకారం, ఈ వేడుక ఆగస్టు 10న హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ ప్రకటనతో, విజయవాడలో ఈవెంట్ నిర్వహిస్తారనే ఊహాగానాలకు తెర పడింది.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ఎన్టీఆర్ హాజరుకానున్నారు. అయితే హృతిక్ రోషన్ హాజరవుతారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ వార్ 2పై అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అడ్వానీ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.