ఏపీలో విడుదల కానున్న వార్ 2 చిత్రానికి టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన ధన్యవాదాలను తెలిపిన ఎన్టీఆర్, “‘వార్ 2’ విడుదల సందర్భంగా కొత్త జీఓను ఆమోదించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
ప్రభుత్వ జీఓ ప్రకారం, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లు ₹75 (జీఎస్‌టీతో కలిపి), మల్టీప్లెక్సుల్లో ₹100 (జీఎస్‌టీతో కలిపి) పెంచుకోవచ్చు. రేపు విడుదల రోజు ఉదయం 5 గంటలకు స్పెషల్ షో టికెట్ ధరను ₹500 (జీఎస్‌టీతో కలిపి)గా నిర్ణయించారు. పెంచిన టికెట్ రేట్లు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయి.