యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ‘వార్ 2’ గురించి స్పందించాడు. ఈ చిత్రాన్ని ఒప్పుకునేందుకు ప్రధాన కారణం స్క్రిప్ట్ అనే విషయం స్పష్టం చేశాడు. నటుడిగా తనను సవాల్ చేసే పాత్ర కావాలన్న కోణంలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు వెల్లడించాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదల కానుంది.
‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ, “భారతీయ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వాలనుకున్నాను. ‘వార్ 2’లో నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. నటుడిగా నాకు సవాల్ విసిరింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నాను” అని అన్నారు.
ఇక ఈ సినిమాలో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి వచ్చిన వారు కలిసి పనిచేశారన్నారు. “ఇప్పటికి మనం ఒకే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. ప్రాంతీయ సినిమాలుగా కాకుండా కలిసి ఎదగాలి” అన్నారు ఎన్టీఆర్. ఇందులో ఆయన ‘విక్రమ్’ అనే స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అలాగే హృతిక్ రోషన్ నటించిన కబీర్ పాత్రకు తాను పోటీగా ఉంటానని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వంట చేయడం ఇష్టమని, తన భార్య ప్రణతి కోసం బిర్యానీ వండడాన్ని ఆస్వాదిస్తానని చెప్పారు.