టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తిపట్ల చూపే నిబద్ధతను మరోసారి నిరూపించారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో కమర్షియల్ యాడ్ షూట్ జరుగుతుండగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
వైద్యులు ఆయనకు కొన్ని వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. అయితే షూటింగ్ వాయిదా పడితే భారీగా వేసిన సెట్స్, స్టూడియో అద్దె భారమంతా నిర్మాతపై పడుతుందని భావించిన ఎన్టీఆర్, విశ్రాంతిని పక్కనపెట్టి నొప్పిని భరిస్తూ మరుసటి రోజే సెట్స్‌లోకి వచ్చి షూట్‌ను పూర్తి చేశారు.
ఆయన చూపిన ఈ నిబద్ధత చూసి యూనిట్ సభ్యులు, యాడ్ మేకర్స్ ఆశ్చర్యపోయారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసి తన కట్టుబాటును మరొకసారి రుజువు చేశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కోలుకుంటున్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమాలో కొత్త షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. అదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 కూడా చర్చల దశలో ఉంది.