పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు
ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ పాక్‌పై గట్టి చర్యలు తీసుకోగా, దానికి ప్రతిగా పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతలాన్ని ఉపయోగించేందుకు నిషేధం విధించింది. దీటుగా స్పందించిన భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసేసింది.
ఇందుకు సంబంధించి NOTAM (నోటీస్ టు ఎయిర్‌మెన్) కూడా జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు అమల్లో ఉంటుంది. ఇది పాకిస్తాన్ తీసుకున్న చర్యకు సమాధానంగా తీసుకున్న గట్టి నిర్ణయం.
నిపుణుల ప్రకారం, పాకిస్తాన్ ఎయిర్‌లైన్లపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. సాధారణంగా సింగపూర్, థాయిలాండ్, మలేసియా వంటి దేశాలకు వెళ్లే పాకిస్తాన్ విమానాలు భారత గగనతలం మీదుగా వెళ్తుంటాయి. ఇప్పుడు బాన్ వల్ల చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలు మళ్లించాల్సి వస్తుంది, దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి.
ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాక్ ఎయిర్‌లైన్లకు ఇది ఇంకా భారంగా మారనుంది. నిపుణుల మాటల్లో, ఈ చర్యల వల్ల భారత్ కన్నా పాకిస్తాన్‌కే ఎక్కువ ఆర్థిక నష్టం జరుగుతోందట.