హైదరాబాద్ వర్షం: తెల్లవారుజాము నుంచే జల్లులు, వాతావరణం చల్లబడింది

హైదరాబాద్ వాతావరణం: నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం

ఉదయం నుంచే వర్షం
హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. మొదట చిరుజల్లులతో ప్రారంభమైన వాన క్రమంగా మోస్తరు వర్షంగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.

ట్రాఫిక్ ఇబ్బందులు
వర్షం కారణంగా కొన్ని రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో ఉదయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే బుధవారం రాత్రి కూడా హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది.

చల్లబడిన వాతావరణం
వరుసగా కురుస్తున్న ఈ వర్షాలతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. ఉక్కపోత తగ్గి ప్రజలకు ఉపశమనం లభించింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book