హైదరాబాద్ వర్షాలు: రికార్డు స్థాయి వర్షం – జనజీవనం అస్తవ్యస్తం

హైదరాబాద్‌లో భారీ వర్షం: రికార్డు స్థాయి వర్షపాతం – నగర జీవనం స్తంభన

గురువారం సాయంత్రం హైదరాబాద్‌ను ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. కొన్ని గంటలపాటు కురిసిన కుండపోత వానతో రోడ్లు జలమయమై, ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యాలయాల నుండి ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే ఇరుక్కుపోయారు.

కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి (14 సెం.మీ.), సరూర్‌నగర్ (12.8 సెం.మీ.), ఖైరతాబాద్ (12.6 సెం.మీ.) ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి, అనేక ఇళ్లలోకి నీరు చేరింది. శ్రీనగర్ కాలనీలో ఒక ద్విచక్ర వాహనదారుడు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం భయాందోళనలు కలిగించింది. లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, రాజ్‌భవన్ రోడ్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జీహెచ్‌ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, అత్యవసర ఫోన్ నంబర్లు ప్రకటించారు. యాదాద్రి (15 సెం.మీ.), నల్గొండ (14 సెం.మీ.) జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు:
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు – 87126 60600
సైబరాబాద్ కమిషరేట్ – 85004 11111
రాచకొండ కమిషనరేట్ – 87126 62999
హైడ్రా – 91541 70992
జీహెచ్‌ఎంసీ – 81259 71221
జలమండలి – 99499 30003
టీజీఎస్‌పీడీసీఎల్ – 79015 30966
ఎన్డీఆర్‌ఎఫ్ – 83330 68536
కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCCC) – 87125 96106


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book