"హరిహర వీరమల్లు: పవన్ కళ్యాణ్ సినిమాపై ప్రజల అభిప్రాయం ఏంటి?"

పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు సినిమాలో హైలైట్ అంటూ అభిమానులు చెబుతున్నారు.
చారిత్రక కథను దర్శకులు చక్కగా ప్రెజెంట్ చేశారని, సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని వారు అభిప్రాయపడ్డారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పలు వాయిదాల అనంతరం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూశారు. గత రాత్రి ప్రీమియర్ షోలు కాగా, ప్రస్తుతం బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి.

ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయగా, మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ యాక్షన్ సీన్లు, ఎలివేషన్ దృశ్యాలు బాగా ఆకట్టుకున్నాయని వారు చెప్పారు. చారిత్రక నేపథ్యాన్ని దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ చాలా బాగా చూపించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ఎక్కడా బోర్ అనిపించలేదని అన్నారు.

ఈ చిత్రంలో సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా ప్రయత్నించినందుకు ప్రేక్షకులు దర్శకులను ప్రశంసిస్తున్నారు. పార్ట్ 1లో ప్రతి పాత్రను మొదటి నుండి చివరి వరకు బాగా డిజైన్ చేశారని, పార్ట్ 2లో వాటికి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశముందని చెప్పారు. కీరవాణి సంగీతం సినిమాకు హైలైట్ అని అన్నారు. పవన్ లాంటి నటుడు ఇలాంటి పాత్రలకు అర్హుడని, ఆయనకే సరిపోయే పాత్ర అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book