తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

జూన్ 2, అమరావతి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎక్స్‌’ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“తెలుగు రాష్ట్రాలుగా వేరైనా, తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా ఎదగాలన్నదే నా కోరిక,” అని ఆయన తెలిపారు.

“11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి కుటుంబం సుఖంగా, శాంతిగా జీవించాలని, రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను,” అని ఆయన అన్నారు.

అంతేగాక, “రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడి, వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలి. ప్రపంచంలో తెలుగు జాతి గర్వించదగిన స్థాయికి ఎదగాలి. అందుకు ప్రతి తెలుగువాడు భాగస్వామి కావాలి,” అని చంద్రబాబు స్పష్టం చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book