టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికలో తనదైన శైలిలో స్పందించారు. “VIZAG” అనే పదంలో ‘G’ స్థానంలో గూగుల్ లోగోను జోడించి ప్రత్యేకమైన పోస్టర్ రూపొందించారు. సముద్ర తీరం నేపథ్యంగా ఉండటంతో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఏఐ (AI) డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ కీలక పరిణామం దేశవ్యాప్తంగా విశాఖ నగరంపై టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచుకున్న క్రియేటివ్ పోస్ట్ ద్వారా “వైజాగ్‌లో గూగుల్” అనే సందేశం స్పష్టంగా ప్రజలకు చేరుతోంది. నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించడంతో, ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.