రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ళ బంధాన్ని ప్రతిబింబిస్తూ, “నీ కోసం నేనున్నాను” అనే భరోసా ఇచ్చే శుభ సందర్భమని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ, “నా తెలుగింటి ఆడపడుచులకు, ప్రియమైన అక్కాచెల్లెళ్ళకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నగా మీ జీవితాల్లో వెలుగులు నింపుతూ, మీ రక్షణ కోసం నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని చెప్పారు.
అలాగే ఆడబిడ్డల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇస్తూ, మరోసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పండుగను అన్నాచెల్లెళ్ళు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.