ఎయిర్ ఇండియా & ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: సైనికులకు ప్రత్యేక ఆఫర్లు

భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని ఉగ్రవాద స్థావరాలపై బుధవారం తెల్లవారుజామున చేపట్టిన దాడుల నేపథ్యంలో, ఎయిరిండియా మరియు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు సైనిక సిబ్బందికి ప్రత్యేక ప్రయాణ వసతులను ప్రకటించాయి.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మే 31 వరకు డిఫెన్స్ ఫేర్ల కింద టికెట్లు బుక్ చేసుకున్న సైనికుల కోసం పూర్తి రద్దు డబ్బును తిరిగి ఇవ్వడం లేదా జూన్ 30 వరకు ఒకసారి ఉచితంగా టికెట్ రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి.

ఎయిరిండియా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఇలా పేర్కొంది:

“మన రక్షణ బలగాలకు మద్దతుగా, మే 31 వరకు డిఫెన్స్ ఫేర్స్ కింద టికెట్ బుక్ చేసుకున్న సైనిక సిబ్బందికి రద్దు చేయించినా, లేదా జూన్ 30 వరకు ఒకసారి ఎలాంటి అదనపు రుసుము లేకుండా టికెట్లు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించాం.”

ఇటీవలి కాలంలో, భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ మరియు పీవోకేలోని జైషే మహమ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు 25 నిమిషాల వ్యవధిలో క్షిపణులు, డ్రోన్లతో మెరుపు వేగంలో నిర్వహించి, ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది.

ఈ నేపథ్యంలో, సైనిక సిబ్బంది ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఈ ప్రత్యేక వసతిని ప్రకటించడం గమనార్హం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens