శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీటి ప్రవాహం

సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం 83,242 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో 98,676 క్యూసెక్కులుగా ఉంది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28,361 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 878.90 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182.21 టీఎంసీలుగా ఉంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book